![]() |
![]() |
.webp)
జబర్దస్త్ ఇప్పుడు సరదా శుక్రవారం, సరిపోదా శనివారంగా డివైడ్ అవ్వడంతో కామెడీ కూడా కొంచెం బాగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక సరిపోదా శనివారం షోలో బులెట్ భాస్కర్ స్కిట్ మాములుగా లేదు. ఇందులో ఫేమస్ సెలబ్రిటీస్ పట్టుకుని అంత మాట అనేశాడు. ఇంతకు ఏమయ్యిందంటే బులెట్ భాస్కర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లకు మొత్తం అప్పజెప్పారు. ఐతే భాస్కర్ పెళ్లి ఈవెంట్ కి యాంకర్స్ గా సుమ, రష్మీ, ఇంద్రజ అని ఈవెంట్ మేనేజర్ లిస్ట్ చూపించేసరికి భాస్కర్ ఒక్కసారిగా ఫైర్ ఐపోయి ఆ లిస్ట్ ని విసిరిగొట్టాడు.
"నేనేమన్నా ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెళ్లి చేసుకుంటున్నానా.. ఎక్కడ దొరికార్రా ఈ పించన్ బ్యాచ్ నీకు" అంటూ నాటీ నరేష్ మీద ఫైర్ అయ్యాడు. "రష్మీకి తెలుగు రాదు ఐనా పదేళ్ల నుంచి యాంకరింగ్ చెయ్యట్లేదు. కాబట్టి శ్రీదేవి కూతురు జాన్వీని యాంకరింగ్ కి పెట్టు. " అన్నాడు భాస్కర్. ఇక నాటీ నరేష్ మరి మేల్ యాంకర్ ని ఎవరిని పెడదాం ఫామిలీ స్టార్ ని పెడదామా అనేసరికి "హా విజయ్ దేవరకొండ... సూపర్ పెట్టెయ్" అన్నాడు దానికి నరేష్ ఆయన కాదు సుడిగాలి సుధీర్ అంటూ చెప్పాడు. "మరి గెస్టులుగా ఎవరిని పిలుద్దాం..షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్" అని నరేష్ అడిగేసరికి " ఒకప్పుడు షారుఖ్ ని, సల్మాన్ ని చూడడానికి అందరూ ముంబై వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకే అక్కడ పని లేక వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసుకుంటున్నారు" అంటూ పంచ్ డైలాగ్స్ ఈ స్కిట్ లో ఎంటర్టైన్ చేసాడు.
![]() |
![]() |